Tuesday, June 1, 2010

తేటతేట తెలుగులా... తెల్లవారి వెలుగులా..!!


తేటతేట తెలుగులా, తెల్లవారి వెలుగులా
తేరులా, సెలయేరులా
కలకలా గలగలా
కదలి వచ్చిందీ కన్నె అప్సరా
వచ్చి నిలిచిందీ కనుల ముందరా (తేట)



తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా (తె)
గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినదీ .. పలికినదీ .. పలికినదీ
చల్లగా, చిరుజల్లుగా
కలకలా, గలగలా
కదలి వచ్చిందీ కన్నె అప్సరా
వచ్చి నిలిచిందీ కనుల ముందరా (తేట)

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి (రె)
లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవీ .. వెలిసినవీ .. వెలిసినవీ
వీణలా, నెరజాణలా
కలకలా, గలగలా
కదలి వచ్చిందీ కన్నె అప్సరా
వచ్చి నిలిచిందీ కనుల ముందరా (తేట)

2 comments:

Anonymous said...

Nice

Uday Kumar said...

super taste of music....congrats