Tuesday, December 20, 2011

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు...!!


ఇవ్వాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న మా అబ్బాయి "వేణు" కి ప్రేమతో...

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు

జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ

నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామ నువ్వనీ
ఊరువాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైన


చిత్రం : యమలీల
నటీనటులు : అలీ, ఇంద్రజ, మంజు భార్గవి, సత్యనారాయణ తదితరులు
గానం : చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

Thursday, December 15, 2011

చుక్కల్లే తోచావే... ఎన్నెల్లే కాచావే...!చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే

పూసిందే ఆ పూల మాను నీ దీపంలో
కాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికి నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాలకు చేరం తీరందీ నేరం
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే

తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్దం ఇన్నేళ్ళుగ వ్యర్ధం చట్టం దే రాజ్యం
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే


చిత్రం : నిరీక్షణ
దర్శకత్వం: బాలు మహేంద్ర
తారాగణం: భానుచందర్, అర్చన, నిర్మల
సంగీతం:  ఇళయరాజా

Friday, December 9, 2011

అమ్మంటే తెలుసుకో..!


అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో
ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ "అమ్మ"

ఓ..ఓ... ఓ.. అనుబంధానికి
ఓ... ఓ.. ఓ... అనురాగానికి
తొలి తొలి రూపం అమ్మంటే

నాన్నంటే తోడురా
నీ వెంటే నీడరా

అమ్మైన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం
గుండెల్లో నింపింది ప్రేమామృతం
పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం
స్త్రీ జాతి త్యాగాలు రాసినా గ్రంథం
మమతెరిగిన మాతృత్వం తరగని అందం
అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం
అతి మధురం తల్లీ తండ్రీ అయ్యే క్షణం

అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో

పుట్టించగలిగేది మగజన్మ అయినా
ప్రతివారు కాలేరు నిజమైన నాన్న
కన్నతండ్రి అన్న పదవి జంతువులకు ఏది
ఆ జ్ఞానముంటేనే అసలైన తండ్రి
ఇదిగిదిగో ఈ బిడ్డను కన్నది వీరే
అని నలుగురు తననెంతో పొగుడుతుఉంటే
తండ్రి అవడం అంటే అర్థం అదే కదా

నాన్నంటే తోడురా
నీవెంటే నీడరా
నిను పాలించే మహరాజు పేరు నాన్న
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో........
 
చిత్రం: మావిడాకులు (1998)
నటీనటులు : జగపతి బాబు, రచన
గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సునీత