Thursday, December 15, 2011

చుక్కల్లే తోచావే... ఎన్నెల్లే కాచావే...!



చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే

పూసిందే ఆ పూల మాను నీ దీపంలో
కాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికి నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాలకు చేరం తీరందీ నేరం
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే

తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్దం ఇన్నేళ్ళుగ వ్యర్ధం చట్టం దే రాజ్యం
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే


చిత్రం : నిరీక్షణ
దర్శకత్వం: బాలు మహేంద్ర
తారాగణం: భానుచందర్, అర్చన, నిర్మల
సంగీతం:  ఇళయరాజా

4 comments:

మౌనముగా మనసుపాడినా said...

!! శోభ !! గారు చాలా మంచి సాంగ్ అండి నాకు చాలా ఇష్టం ధన్యవాములు

మధురవాణి said...

అబ్బ.. భలే పాట గుర్తు చేసారండీ.. ఈ పాట వింటుంటే మనసంతా భారంగా అయిపోతుంది.. నేనీ మధ్యే చూసాను ఈ సినిమా..

శోభ said...

@ మౌనముగా మనసు పాడినా గారికి,

@ మధురవాణిగారికి ధన్యవాదాలు. ఈ పాట ఇష్టపడనివారు బహుశా చాలా అరుదుగా ఉంటారేమో మధురా..... నాక్కూడా ఈ పాటంటే ఎంతిష్టమో చెప్పలేను... :)

Unknown said...

ధన్యవాదాలు చాలా మంచి పాట నాకు చాలా ఇష్టం