Tuesday, December 20, 2011

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు...!!


ఇవ్వాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న మా అబ్బాయి "వేణు" కి ప్రేమతో...





సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు

జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ

నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామ నువ్వనీ
ఊరువాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైన


చిత్రం : యమలీల
నటీనటులు : అలీ, ఇంద్రజ, మంజు భార్గవి, సత్యనారాయణ తదితరులు
గానం : చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

2 comments:

ఎందుకో ? ఏమో ! said...

ఏనాటి నుంచో ఈ పాట అంటే చాలా ఇష్టం

నిన్ననో మొన్న నో ఒక స్నేహితుడి కొడుకు వీడియో అతని సిస్టం లో ప్లే అవ్వక పోతే నేను నా లాప్ ద్వారా దానికి మరిన్ని హంగులు చేసి
bgm ఈ పాట పెడదాం అనుకుంటే ఎంత వెతికినా దొరకలేదండి

ఇప్పుడే డౌన్లోడ్ చేసాను మీరు ఇక్కడ ఉంచిన వీడియో ని

చాలా థాంక్స్

?!

ఎందుకో ? ఏమో ! said...

ఏనాటి నుంచో ఈ పాట అంటే చాలా ఇష్టం

నిన్ననో మొన్న నో ఒక స్నేహితుడి కొడుకు వీడియో అతని సిస్టం లో ప్లే అవ్వక పోతే నేను నా లాప్ ద్వారా దానికి మరిన్ని హంగులు చేసి
bgm ఈ పాట పెడదాం అనుకుంటే ఎంత వెతికినా దొరకలేదండి

ఇప్పుడే డౌన్లోడ్ చేసాను మీరు ఇక్కడ ఉంచిన వీడియో ని

చాలా థాంక్స్