Tuesday, October 30, 2012

ఆట గదరా శివా.. ఆట గద కేశవా...!!!


ఆట గదరా శివా..
ఆట గద కేశవా
ఆట గదరా నీకు అమ్మతోడు

ఆట గద జననాలు
ఆట గద మరణాలు        "ఆట"
మధ్యలో ప్రణయాలు
ఆట నీకూ..

ఆట గద సొంస్థాలు
ఆట గద పంతాలు          "ఆట"
ఆట గద అంతాలు
ఆట నీకు




ఆట గదరా నలుపు
ఆట గదరా తెలుపు         "ఆట"
నలుపు తెలుపుల గెలుపు
ఆట నీకు

ఆట గదరా మన్ను
ఆట గదరా మిన్ను         "ఆట"
మిధ్యలో ఉంచి
ఆడేవు నన్ను

ఆట గదరా శివ ఆట గద కేశవా 
ఆట గదరా శివ ఆట గద కేశవా 
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు 
ఆట గదరా శివ ఆట గద కేశవా


చిత్రం          : మిథునం
నటీనటులు : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి
దర్శకత్వం  : తనికెళ్ల భరణి

2 comments:

ఎందుకో ? ఏమో ! said...

పవర్ పాయింట్ లో presentations చేయటం తెలిసింది, anu స్క్రిప్ట్ అందుబాటు లో ఉంది తెలుగు టైపింగ్ కి,

తనికళ్ళ భరణి వారి పాటగా ఆల్రెడీ ప్రాచుర్యం లో ఉంది

నెట్ లో దొరికింది.

మనం ఒక స్లయిడ్ షో చేస్తే తప్పేంటి?

అని ఆపాట భావాన్ని దృశ్యం లో చూపాలని తపిస్తూ

భావానుగునం గా స్లైడ్స్ arrange చేసాను, కాని

ఆ పాట చేసిన కొంత కాలానికి ఈ పాటనూ వేరొకరికి చూపుతున్న తరుణం లో

ఫోన్ మ్రోగింది. పాటేమో, ఆట గద జననాలు ఆట గద మరణాలు వద్ద సాగుతుంటే pause చేసాను

ఫోన్ లో వార్త మనసుని ఆగేలా చేసింది.

ఇప్పుడు అనిపిస్తున్నది

పదాలు దృశ్యాలు ఎన్ని టి ద్వారా ఎం గ్రహించాం అనికాదు

ఆ గ్రహించిన దానిని ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా సమన్వయం చేసుకుని

ఏ విధంగా ప్రజ్ఞ స్థితి లో స్థిరం అయ్యావ్?

అన్నదే ultimate, మిగితావన్నీ ట్రాష్..

అదీ సంగతి !!

శోభ said...

ప్రతి పని వెనుకా ఓ కారణాన్ని విశ్లేషించటం... మీ తరువాతే ఎవరైనా అనిపిస్తోంది...

ధన్యవాదాలు శివగారు.