Tuesday, January 22, 2013

మీటి చూడు నీ హృదయాన్ని...!!

మీటి చూడు నీ హృదయాన్ని... పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్ని... పలుకుతుంది ఒక రాగం
తరచిచూడు నీ గతాన్ని మిగులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో... ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరి పోవును

పూడిపోయిన గొంతులా... ఓడిపోయిన గుండెలా
పూడిపోయిన గొంతులా... ఓడిపోయిన గుండెలా
నీలో..
ఊపిరాడక ఉన్నది... హృదయమే అర్పించుకున్నది
ఊపిరాడక ఉన్నది... హృదయమే అర్పించుకున్నది

ఆ రూపం ఎవ్వరిదో... ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరి పోవును

పువ్వులోని పిందెలా... పిందెలోని తీపిలా
పువ్వులోని పిందెలా... పిందెలోని తీపిలా
నీలో...
లీనమైనది... కానరానిది
నీ పదము తానై మూగబోయినదీ... మూగబోయినదీ...

ఆ రూపం ఎవ్వరిదో... ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరి పోవును

మనసు మూలలు వెతికిచూడూ... మరుగు పొరలను తీసి చూడూ
మనసు మూలలు వెతికిచూడూ... మరుగు పొరలను తీసి చూడూ
ఏదో...
మబ్బుమూసి... మసకకమ్మి
మమతమాయక ఉన్నది... నీ మనిషి తాననుకున్నది 

మీటి చూడు నీ హృదయాన్ని... పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్ని... పలుకుతుంది ఒక రాగం
తరచిచూడు నీ గతాన్ని మిగులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో... ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరి పోవును

చిత్రం : చీకటి వెలుగులు
సంగీతం : చక్రవర్తి
గీత రచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల
నటీనటులు : కృష్ణ, వాణిశ్రీ, పద్మప్రియ