Tuesday, February 26, 2013

జీవితమే సఫలము..!జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము

చరణం1:

హాయిగా తీయగా ఆలపించు పాటలా
హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
అనారు పూలతోటలా అనారు పూలతోటలా
ఆశ దెలుపు ఆటలా

జీవితమె సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము

చరణం2:

వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా
వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా
అంతులేని వింతలా అనంతప్రేమ లీలగా
అంతులేని వింతలా అనంతప్రేమ లీలగా
వరించు భాగ్యశాలలా వరించు భాగ్యశాలలా
తరించు ప్రేమ జీవులా

జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము

చిత్రం : అనార్కలి (1955)
నటీనటులు : అంజలి, నాగేశ్వరరావు
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : జిక్కి

0 comments: