Friday, March 4, 2016

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ..!!





ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నాయెదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన
రొదగా నాయెదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ

లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాలలాహో

విడిపోలేని విరితీవెలలో
కురులే మరులై పోతుంటే
ఎడబాటేది యెదలోతులలో
అదిమే వలపే పుడుతుంటే

తనువూ తనువూ తరువూ తరువై
పుప్పొడి ముద్దే పెడుతుంటే
పూలే గంధం పూస్తుంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధన

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ

లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాలలాహో

గళమే పాడే కల కోయిలనే
వలచీ పిలిచే నా గీతం హో
నదులై సాగే ఋతు శోభలనే
అభిషేకించే మకరందం
గగనం భువనం కలిసే సొగసే
సంధ్యారాగం అవుతుంటే
లయలే ప్రియమై పోతుంటే హో
వనమే యవ్వనమై జీవనమై సాగే రాగాలాపన

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నాయెదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన

చిత్రం : ప్రేమించు..పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గాయకులు : బాలు, జానకి.