Showing posts with label శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్. Show all posts
Showing posts with label శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్. Show all posts

Thursday, May 16, 2013

రాకోయి అనుకోని అతిథి..!!






రాకోయి అనుకోని అతిథి
కాకిచేత కబురైనా పంపక
రాకోయి అనుకోని అతిథి

వాకిటి తలుపులు తెరువనే లేదు
ముంగిట ముగ్గులా తీర్చనేలేదు
వేళకాని వేళా
ఈ వేళకాని వేళా
ఇంటికి రాకోయి అనుకోని అతిథి
రాకోయీ....

సిగలో పువ్వులు ముడవాలంటే
సిరిమల్లెలు వికసింపనే లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడల వీడనే లేదు
పాలు వెన్నలు తేనే లేదు
పంచభక్ష్యములా చేయనే లేదు
వేళకాని వేళా
ఈ వేళకాని వేళ
విందుకు రాకోయి అనుకోని అతిథీ
రాకోయీ

ఊరక దారిని పోతూ పోతూ
అలసీ వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసీ వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసీ వచ్చితివో
రమ్మనుటకు సాహసము చాలదు
పొమ్మనుట మర్యాద కాదది
వేళ కాని వేళా
ఈ వేళకాని వేళ
త్వరపడి రాకోయి అనుకోని అతిథీ
కాకిచేత కబురైనా పంపక
రాకోయి అనుకోని అతిథీ
రాకోయీ.......



చిత్రం : శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్
సంగీతం : పెండ్యాల నాగేశ్వర్ రావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
నటీ నటులు : కృష్ణ, జయప్రద