Friday, December 9, 2011

అమ్మంటే తెలుసుకో..!


అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో
ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ "అమ్మ"

ఓ..ఓ... ఓ.. అనుబంధానికి
ఓ... ఓ.. ఓ... అనురాగానికి
తొలి తొలి రూపం అమ్మంటే

నాన్నంటే తోడురా
నీ వెంటే నీడరా

అమ్మైన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం
గుండెల్లో నింపింది ప్రేమామృతం
పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం
స్త్రీ జాతి త్యాగాలు రాసినా గ్రంథం
మమతెరిగిన మాతృత్వం తరగని అందం
అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం
అతి మధురం తల్లీ తండ్రీ అయ్యే క్షణం

అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో

పుట్టించగలిగేది మగజన్మ అయినా
ప్రతివారు కాలేరు నిజమైన నాన్న
కన్నతండ్రి అన్న పదవి జంతువులకు ఏది
ఆ జ్ఞానముంటేనే అసలైన తండ్రి
ఇదిగిదిగో ఈ బిడ్డను కన్నది వీరే
అని నలుగురు తననెంతో పొగుడుతుఉంటే
తండ్రి అవడం అంటే అర్థం అదే కదా

నాన్నంటే తోడురా
నీవెంటే నీడరా
నిను పాలించే మహరాజు పేరు నాన్న
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో........
 
చిత్రం: మావిడాకులు (1998)
నటీనటులు : జగపతి బాబు, రచన
గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సునీత

Tuesday, October 4, 2011

నిలువుమా నిలువుమా నీలవేణి...!



నిలువుమా నిలువుమా నీలవేణి
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణి

అడుగడున ఆడే లే నడుము సొంపులా
అడుగడున ఆడే లే నడుము సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపుల
తడబడే అడుగుల నటనల మురిపింపుల
సడిసేయక ఊరించే...
సడిసేయక ఊరించే వయ్యారపు ఒంపుల
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా
నడచిరా సడచిరా నాగవేణి
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణి

అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి
నా ఊర్వశి రావే రావేయని పిలువునా
నా ఊర్వశి రావే రావేయని పిలువునా
ఆ సుందరి నెరనీకు నీగోటికి సమమౌనా
రాచెలీ నినుమదీ దాచుకోని
రాచెలీ నినుమదీ దాచుకోని
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణి
చిత్రం : అమరశిల్పి జక్కన్న (1964)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల

Monday, October 3, 2011

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా...!!



తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని ఓ...
నీలో నన్ను చూసుకొంటిని
తెరిచి చూసి చదువు వేళ
కాలి పోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికి ఉంటిని ఓ...
నీలో నన్ను చూసుకొంటిని

కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనిపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలొ వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కానులే ప్రియతమా
కనులూ తెరువుమా

మధురమైన మాటలు ఎన్నో
కలసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగి పోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడూ పిలిచినా
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని ఓ...
నీలో నన్ను చూసుకొంటిని

చిత్రం : 7/G బృందావన కాలని (2004)
రచన : ఎ.ఎమ్.రత్నం
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : శ్రేయా ఘోషల్

Friday, September 30, 2011

నా మది నిన్ను పిలిచింది గానమై....!!


ఓ ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా...

నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై

ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
తలపులలోనే నిలిచేవు నీవే
తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై "నా మది"

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
వేచిన మదినే వెలిగింప రావే
వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై

నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై


చిత్రం : ఆరాధన (1976)
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరి హనుమంతరావు
గానం : మహ్మాద్ రఫీ

Thursday, September 29, 2011

ఓ నాన్నా... నీ మనసే వెన్న....!!



ఓ నాన్నా... ఓ నాన్నా...
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
ఓ నాన్నాఓనాన్నా...

ముళ్ళబాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ముళ్ళబాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి ఉంచావు

ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓనాన్నా...

పుట్టింది అమ్మ కడుపులోనైనా
పాలు పట్టింది నీ చేతిలోన
పుట్టింది అమ్మ కడుపులోనైనా
పాలు పట్టింది నీ చేతిలోన
ఊగింది ఉయ్యాలలోనైనా
ఊగింది ఉయ్యాలలోనైనా
నేను దాగింది నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన

ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓనాన్నా...

ఉన్ననాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి సాచనన్నావు
ఉన్ననాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి సాచనన్నావు
నీ రాచ గుణమే మా మూలధనము
నీ రాచ గుణమే మా మూలధనము
నీవే మాపాలి దైవము

ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓనాన్నా...

చిత్రం : ధర్మదాత (1970)
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.చలపతిరావు
గానం : ఘంటసాల, జయదేవ్, పి.సుశీల

Saturday, October 30, 2010

కన్నెపిల్లవని.. కన్నులున్నవని...!!


తన్న తన్నన్నన్న తన్న తన్నన్నన్న
తన్నన్నన్న తానా తానా తన్నాన్నా

ఆహా...
కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

లల్ల లల్లల్లల్ల లల్ల లల్లల్లల్ల
లల్లల్లల్లల్లల్ల లాలా లాలా లల్లల్లా

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

నానాన్నా...సంగీతం నన్నానా...నువ్వైతే
రీసరీ...సాహిత్యం మ్మ్ మ్మ్ మ్మ్...నేనౌతా
సంగీతం..నువ్వైతే..సాహిత్యం..నేనౌతా

కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ


ననాననానా say it once again
ననాననానా మ్మ్...స్వరము నీవై
తారాననా తారారా ననా
స్వరమున పదము నేనై ok?
తానే తానే తానా
ఆహా, అలాగా..? గానం గీతం కాగా
తరానా తానా...కవిని నేనై
తా నా ననానా తానా....నాలో కవిత నీవై
నాన నాననా లాలాలా తననా తారనా
కావ్యమైనదీ తలపో పలుకో మనసో

కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
సంగీతం..నువ్వైతే..సాహిత్యం..నేనౌతా

తననా తన్నా తన్నా
మ్మ్ మ్మ్...తననా తననా అన్నా
తానా తన్నా తానన్ తరనా తన్నా
తానా అన్నా తాళం ఒకటే కదా
తనన తాన తాన్న నాన్న తన్నా
అహా...అయ్యబాబోయ్...
తనన తాన తాన్న నాన్న తన్నా మ్మ్
పదము చేర్చి పాట కూర్చ లేదా
దననీ దససా అన్నా
నీదా అన్నా స్వరమే రాగం కదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా

కన్నెపిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేదే ఎపుడనీ
కన్నెపిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేదే ఎపుడనీ
మ్మ్ ఆహాహా లాలాలా మ్మ్ మ్మ్ మ్మ్ ఆహాహా
లాలాలా లాలాలా లాలాలా లాలాలా

Wednesday, October 6, 2010

సడిసేయకోగాలి సడిసేయబోకే...!!


రాజమకుటం (1960)
సడిసేయకోగాలి సడిసేయబోకే
సడిసేయకోగాలి సడిసేయబోకే..
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే సడిసేయకే

రత్నపీఠికలేని రారాజు నాస్వామి
మణికిరీటములేని మహరాజుగాకేమి
చిలిపిపరుగులుమాని కొలిచిపోరాదే సడిసేయకే

ఏటిగలగలకే ఎగసి లేచేనే
ఆకుకదలికలకే అదరిచూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే సడిసేయకే

పండువెన్నెల నడిగి పాంపుతేరాదే
నీడమబ్బులదాగు నిదురతేరాదే
విరుల వీవెనవూని విసిరిపోరాదే
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే సడిసేయకే కోగాలి...    


దర్శకత్వం :      బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
నిర్మాణం :        బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
రచన :             డి.వి. నరసరాజు
తారాగణం :      నందమూరి తారక రామారావు, రాజసులోచన, రాజనాల,
                      గుమ్మడి వెంకటేశ్వరరావు, కన్నాంబ, పద్మనాభం
సంగీతం :        మాస్టర్ వేణు
సంభాషణలు :  డి.వి. నరసరాజు
నిర్మాణ సంస్థ : వాహినీ ప్రొడక్షన్స్