Wednesday, February 26, 2014

పోనీరా పోనీరా పోనీరా...!!పోనీరా పోనీరా పోనీరా

పోతే పోనీరా
పోయింది ఫొల్లు మిగిలిందే చాలు
పోయింది ఫొల్లు మిగిలిందే చాలు                                "పోనీరా"

ఎంత మబ్బు మూసినా
ఎంతగాలి వీసినా
నీలి నీలి ఆకాశం అల్లాగే ఉంటుంది
ఎంత మబ్బు మూసినా
ఎంతగాలి వీసినా
నీలి నీలి ఆకాశం అల్లాగే ఉంటుంది
ఎంత ఏడుపొచ్చినా
ఎంత గుండె నొచ్చినా
ఎంత ఏడుపొచ్చినా
ఎంత గుండె నొచ్చినా

నీలోపల ఉద్దేశ్యం ఒకలాగే ఉండాలి
నీలోపల ఉద్దేశ్యం ఒకలాగే ఉండాలి                            "పోనీరా"

కష్టాలే కలకాలం కాపురం ఉంటాయి
సౌఖ్యాలు చుట్టాలై వస్తూ పోతుంటాయి
కష్టాలే కలకాలం కాపురం ఉంటాయి
సౌఖ్యాలు చుట్టాలై వస్తూ పోతుంటాయి

వెళ్లాలి బహుదూరం
మోయాలి పెనుభారం
వెళ్లాలి బహుదూరం
మోయాలి పెనుభారం

ఏమైనా కానీరా మన యాత్ర మానం
ఏమైనా కానీరా మన యాత్ర మానం                           "పోనీరా"
చిత్రం : స్నేహం (1977)
దర్శకత్వం : బాపు
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
గీతరచన : ఆరుద్ర