Featured Posts

Friday, March 4, 2016

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ..!!

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నాయెదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన
రొదగా నాయెదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ

లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాలలాహో

విడిపోలేని విరితీవెలలో
కురులే మరులై పోతుంటే
ఎడబాటేది యెదలోతులలో
అదిమే వలపే పుడుతుంటే

తనువూ తనువూ తరువూ తరువై
పుప్పొడి ముద్దే పెడుతుంటే
పూలే గంధం పూస్తుంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధన

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ

లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాల
లాలలాల లాలలాలలాహో

గళమే పాడే కల కోయిలనే
వలచీ పిలిచే నా గీతం హో
నదులై సాగే ఋతు శోభలనే
అభిషేకించే మకరందం
గగనం భువనం కలిసే సొగసే
సంధ్యారాగం అవుతుంటే
లయలే ప్రియమై పోతుంటే హో
వనమే యవ్వనమై జీవనమై సాగే రాగాలాపన

ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్ర వీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నాయెదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన

చిత్రం : ప్రేమించు..పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గాయకులు : బాలు, జానకి.

Wednesday, February 26, 2014

పోనీరా పోనీరా పోనీరా...!!పోనీరా పోనీరా పోనీరా

పోతే పోనీరా
పోయింది ఫొల్లు మిగిలిందే చాలు
పోయింది ఫొల్లు మిగిలిందే చాలు                                "పోనీరా"

ఎంత మబ్బు మూసినా
ఎంతగాలి వీసినా
నీలి నీలి ఆకాశం అల్లాగే ఉంటుంది
ఎంత మబ్బు మూసినా
ఎంతగాలి వీసినా
నీలి నీలి ఆకాశం అల్లాగే ఉంటుంది
ఎంత ఏడుపొచ్చినా
ఎంత గుండె నొచ్చినా
ఎంత ఏడుపొచ్చినా
ఎంత గుండె నొచ్చినా

నీలోపల ఉద్దేశ్యం ఒకలాగే ఉండాలి
నీలోపల ఉద్దేశ్యం ఒకలాగే ఉండాలి                            "పోనీరా"

కష్టాలే కలకాలం కాపురం ఉంటాయి
సౌఖ్యాలు చుట్టాలై వస్తూ పోతుంటాయి
కష్టాలే కలకాలం కాపురం ఉంటాయి
సౌఖ్యాలు చుట్టాలై వస్తూ పోతుంటాయి

వెళ్లాలి బహుదూరం
మోయాలి పెనుభారం
వెళ్లాలి బహుదూరం
మోయాలి పెనుభారం

ఏమైనా కానీరా మన యాత్ర మానం
ఏమైనా కానీరా మన యాత్ర మానం                           "పోనీరా"
చిత్రం : స్నేహం (1977)
దర్శకత్వం : బాపు
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
గీతరచన : ఆరుద్ర

Thursday, May 16, 2013

రాకోయి అనుకోని అతిథి..!!


రాకోయి అనుకోని అతిథి
కాకిచేత కబురైనా పంపక
రాకోయి అనుకోని అతిథి

వాకిటి తలుపులు తెరువనే లేదు
ముంగిట ముగ్గులా తీర్చనేలేదు
వేళకాని వేళా
ఈ వేళకాని వేళా
ఇంటికి రాకోయి అనుకోని అతిథి
రాకోయీ....

సిగలో పువ్వులు ముడవాలంటే
సిరిమల్లెలు వికసింపనే లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడల వీడనే లేదు
పాలు వెన్నలు తేనే లేదు
పంచభక్ష్యములా చేయనే లేదు
వేళకాని వేళా
ఈ వేళకాని వేళ
విందుకు రాకోయి అనుకోని అతిథీ
రాకోయీ

ఊరక దారిని పోతూ పోతూ
అలసీ వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసీ వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసీ వచ్చితివో
రమ్మనుటకు సాహసము చాలదు
పొమ్మనుట మర్యాద కాదది
వేళ కాని వేళా
ఈ వేళకాని వేళ
త్వరపడి రాకోయి అనుకోని అతిథీ
కాకిచేత కబురైనా పంపక
రాకోయి అనుకోని అతిథీ
రాకోయీ.......చిత్రం : శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్
సంగీతం : పెండ్యాల నాగేశ్వర్ రావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
నటీ నటులు : కృష్ణ, జయప్రద

Friday, April 19, 2013

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే...!!అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై
సంగతేదో తెలిపే పలపే సంగతేదో పలికే
దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

చిత్రం : చెట్టుకింద ప్లీడరు
గానం : బాలు, చిత్ర
నటీనటులు : రాజేంద్రప్రసాద్ ఇతరులు

Tuesday, February 26, 2013

జీవితమే సఫలము..!జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము

చరణం1:

హాయిగా తీయగా ఆలపించు పాటలా
హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
అనారు పూలతోటలా అనారు పూలతోటలా
ఆశ దెలుపు ఆటలా

జీవితమె సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము

చరణం2:

వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా
వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా
అంతులేని వింతలా అనంతప్రేమ లీలగా
అంతులేని వింతలా అనంతప్రేమ లీలగా
వరించు భాగ్యశాలలా వరించు భాగ్యశాలలా
తరించు ప్రేమ జీవులా

జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము

చిత్రం : అనార్కలి (1955)
నటీనటులు : అంజలి, నాగేశ్వరరావు
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : జిక్కి

Tuesday, January 22, 2013

మీటి చూడు నీ హృదయాన్ని...!!


మీటి చూడు నీ హృదయాన్ని... పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్ని... పలుకుతుంది ఒక రాగం
తరచిచూడు నీ గతాన్ని మిగులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో... ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరి పోవును

పూడిపోయిన గొంతులా... ఓడిపోయిన గుండెలా
పూడిపోయిన గొంతులా... ఓడిపోయిన గుండెలా
నీలో..
ఊపిరాడక ఉన్నది... హృదయమే అర్పించుకున్నది
ఊపిరాడక ఉన్నది... హృదయమే అర్పించుకున్నది

ఆ రూపం ఎవ్వరిదో... ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరి పోవును

పువ్వులోని పిందెలా... పిందెలోని తీపిలా
పువ్వులోని పిందెలా... పిందెలోని తీపిలా
నీలో...
లీనమైనది... కానరానిది
నీ పదము తానై మూగబోయినదీ... మూగబోయినదీ...

ఆ రూపం ఎవ్వరిదో... ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరి పోవును

మనసు మూలలు వెతికిచూడూ... మరుగు పొరలను తీసి చూడూ
మనసు మూలలు వెతికిచూడూ... మరుగు పొరలను తీసి చూడూ
ఏదో...
మబ్బుమూసి... మసకకమ్మి
మమతమాయక ఉన్నది... నీ మనిషి తాననుకున్నది 

మీటి చూడు నీ హృదయాన్ని... పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్ని... పలుకుతుంది ఒక రాగం
తరచిచూడు నీ గతాన్ని మిగులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో... ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును... నీ కలత తీరి పోవును


చిత్రం : చీకటి వెలుగులు
సంగీతం : చక్రవర్తి
గీత రచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల
నటీనటులు : కృష్ణ, వాణిశ్రీ, పద్మప్రియ


Tuesday, December 4, 2012

అసలేం గుర్తుకు రాదు...!అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక   "అసలేం"

నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా
ఉన్నా.. నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా….. "అసలేం"

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ
అల్లుకోమని గిల్లుతోంది చల్ల చల్లని గాలి
తెల్లవార్లు అల్లరల్లరి సాగించాలి
ఎకమై……. ఎకమయే ఏకాంతం, లోకమయే వేళ
ఆ జంట వూపిరి వేడికి మరిగింది వెన్నెల         "అసలేం"

కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించనీ
కవుగిలింతల సీమలో కోట కట్టుకొని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజుల హా హా కారం
మళ్ళీ.. మళ్ళీ...
మళ్ళీ.. మళ్ళీ... ఈ రోజు... రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం

అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా
ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక